హొళగుంద మండల కేంద్రం మీదుగా దిగువ కాల్వ ప్రవాహిస్తుంది. అయితే కాల్వలో పూడిక పెరగడంతో పాటు కాల్వకు ఇరువైపులా పిచ్చిమొక్కలు, గడ్డి పెరగడంతో కాల్వ నీరు గట్టుపై ప్రమాదకరంగా ప్రవాహిస్తుంది.
ప్రతి ఏటా కాల్వ మరమ్మతులు కోసం టీబీ బోర్డు రూ. కోట్లు నిధులు ఖర్చు చేస్తున్న ఇలా కాల్వలు ప్రమాదకరంగా ఉండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.