కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం చెరువుపల్లి గ్రామానికి చెందిన విద్యార్థినిలు నందవరంలో చదువుకుంటున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన కొంతమంది ఆకతాయి కుర్రాళ్ళు అమ్మాయిలను ప్రతిరోజూ వేధిస్తున్నారని ఆరోపించారు.
ఈ వేధింపులు భరించలేక విద్యార్థినిలు పెద్దలకు తెలుపడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు వేధిస్తున్న ఆకతాయిలను ప్రశ్నించడంతో వారిపైనే తిరిగి దాడి చేసి కొట్టినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై నందివర్గం పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఏపీ ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు పూలరాజు మాట్లాడుతూ. దళిత అమ్మాయిలను వేధించడమే కాక వారి బంధువులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులపై చర్యలు తీసుకోని పక్షంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.