గూడ్స్ రైలు కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలో గురువారం ఉదయం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం మంగళగిరి పరిధిలోని నిడమర్రు రోడ్డు లోని రైల్వే గేటు సమీపంలో గురువారం ఉదయం సుమారు 45 సంవత్సరాల వయసు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి వేగంగా వెళుతున్న గూడ్స్ రైలు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే, మంగళగిరి పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాద వశాత్తు రైలు కింద పడ్డారా లేక ఆత్మహత్య చేసుకోవటానికి పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.