కొరిశపాడు మండలం రావినూతల గ్రామంలో ఆదివారం క్రికెట్ స్టేడియం భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సినీ నటుడు రఘుబాబు పాల్గొని 98 లక్షలతో ఏర్పాటు చేసిన స్టేడియాన్ని ప్రారంభోత్సవం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులకు ఈ స్టేడియం ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు. ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని తెలియజేశారు.