తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు శ్రీవారి భక్తులు మరణిస్తే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని, భక్తుల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా అని వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై కూటమి సర్కార్ అనుసరిస్తున్న తీరును వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఎండగట్టారు. మరణించిన బాధితుల కుటుంబాల పట్ల ప్రభుత్వం అత్యంత అమానవీయంగా ప్రవర్తిస్తోంది. ప్రభుత్వ తీరును తుర్పారబడుతూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.