యూపీలోని బులంద్‌షహర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. డబ్బు కోసం భర్త తన ఫ్రెండ్స్‌తో తనపై మూడేళ్లుగా అత్యాచారం చేయిస్తున్నట్లు పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. సౌదీ అరేబియాలోని ఓ ఆటోమొబైల్ కంపెనీలో తన భర్త మెకానిక్‌గా పని చేస్తున్నాడని, ఫ్రెండ్స్ వద్ద భారీగా అప్పులు చేశాడని ఆమె పేర్కొంది. ఈ క్రమంలో ఫ్రెండ్స్‌తో తనపై అత్యాచారం చేయిస్తూ, వీడియో కాల్‌లో చూసి ఆనందించేవాడని వాపోయింది.