ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కష్టపడి చదివితే మంచి ఫలితాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 24, 2022, 09:59 AM

ఇష్టపడి శ్రద్ధగా చదివితే ఇప్పటినుంచైనా మంచి ఫలితాలు వస్తాయని కలసపాడు ఎం ఈవో పుల్లయ్య పేర్కొన్నారు. మండలంలోని చెన్నారెడ్డిపల్లె ఆర్ సి ఎం హై స్కూల్ ను ఎం ఈ ఓ ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పలు సూచనలు చేస్తూ పరీక్షల పట్ల అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఇంటిదగ్గర ఉదయం నాలుగు గంటల నుంచి 7 గంటల దాకా శ్రద్ధగా చదివి మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. సమయపాలన పాటించాలని విద్యార్థులకు తెలియజేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున అందరూ చెట్ల కిందనే చదువుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ జయప్రకాశ్ రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa