పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణ పల్లి వద్ద నిర్మిస్తున్న గృహాలు ఆశించిన స్థాయిలో నిర్మాణాలు కాలేదని అధికారులు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన గృహాలు నిర్మించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పేర్కొన్నారు.బుధవారం ఆమె బ్రాహ్మణ పల్లి వద్ద పేదలకు కేటాయించిన గృహాలు నిర్మిస్తున్న లేఅవుట్ ను పరిశీలించి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం నూతన కలెక్టర్ భవనంగా ఏర్పడబోతున్న సత్య సాయి మ్యూజిక్ కళాశాల పనులను పరిశీలించారు. వీడియో కాన్ఫరెన్స్, కలెక్టర్ చాంబర్, తో పాటు సిబ్బందికి ఏర్పాటు చేస్తున్న గదులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దాదాపు 50 ఎకరాల లేఅవుట్ లో ఇప్పటివరకు 1500 మందికి లబ్ధిదారులకు గృహాలు మంజూరు చేయగా వాటిలో కేవలం 200 మాత్రమే నిర్మాణదశలో ఉన్నాయన్నారు. మునిసిపాలిటీ అధికారులు హౌసింగ్ అధికారులు సమన్వయంగా మరికొన్ని ఏజెన్సీల ద్వారా త్వరితగతిన నిర్మాణాలు మొదలుపెట్టి పూర్తిచేయాలని ఆదేశించారు.యజమానులు కాకుండా ఏజెన్సీల ద్వారా నిర్మాణాలు చేపట్టేలా ఒక ఏజెన్సీకి 200 నుండి 300 గృహాలు అప్పజెప్పి వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గృహాలు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ముందుకు రాకుండా పోతే వాటిని రద్దు చేయడం జరుగుతుందన్నారు.లేఅవుట్లలో అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని లబ్ధిదారులు కోరగా త్రాగు నీరు, రోడ్లు, విద్యుత్ తో పాటు మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. జిల్లాలో ఒకటి, రెండు లేఅవుట్లు మినహా మిగిలిన వాటిలో పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ప్రభుత్వ భూములు అసైన్డ్ భూములు 22a భూములను నిత్యం రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.
ఆక్రమణలు ఏమైనా జరిగితే తమ దృష్టికి తీసుకువస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. నూతన జిల్లా ఏర్పాటు కావడంతో సత్య సాయి మ్యూజిక్ కళాశాల భవనాన్ని కలెక్టర్ భవనంగా ఎన్నుకోవడం జరిగిందని అందులో వీడియో కాన్ఫరెన్స్ గది, కలెక్టర్ చాంబర్ కొరకు కేటాయించిన గదులలో పనులు జరుగుతున్నాయని దాదాపు వారం రోజులలో పనులు పూర్తిచేసి పరిపాలన సాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, లతో ఆయా శాఖల అధికారులు కలరు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa