తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఈ నెల 30వ తేదీన పట్టణంలోని బోసు రోడ్డులో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నిర్వహించినట్లు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు భాస్కరుని శ్రీనివాసరావు చెప్పారు. బుధవారం ఆయన వైద్య శిబిరం వివరాలు తెలియజేస్తూ గుంటూరు జిల్లాలోని పెద్ద కాకాని లో గల శంకర నేత్రాలయ వైద్య సిబ్బందిచే ప్రజలకు కంటి వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించే ఈ వైద్య శిబిరంలో 150 మందికి మాత్రమే కంటి పరీక్షలు నిర్వహిస్తారని, దీనికి సంబంధించిన కూపన్లను ముందుగా పట్టణంలోని గంగానమ్మ పేట లో ఐసిఐసిఐ బ్యాంక్ ఎదురుగా ఉన్నా రూప శ్రీ చందనా ట్రేడర్స్ కార్యాలయంలో పొందవచ్చని వివరాలకు 92464 59299 నెంబర్లకు ఫోన్ చేయవచ్చని తెలిపారు. పట్టణంలోని కొత్తపేట ప్రవీణ్ మెడికల్స్ దుకాణంలో సైతం కూపన్లు తీసుకోవచ్చని అక్కడ వివరాలకు 90309 51637 ఫోన్ నెంబర్ కు సంప్రదించవచ్చని చెప్పారు. వైద్య శిబిరంలో పాల్గొనే ప్రజలు ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటించి తీరాలని వెల్లడించారు. ఉన్న వారికి వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa