ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో సెంచరీల వీరుడిగా అభిమానులందరినీ కూడా ఆశ్చర్యపరుస్తున్న క్రికెటర్ ఎవరు అంటే ఎవరు అందరూ చెప్పే పేరు జోస్ బట్లర్. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న జోస్ బట్లర్ వరుస సెంచరీలతో అదరగొడుతున్నాడు.రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగుతూ బౌలర్ల పై విరుచుకుపడుతూ ఉన్నాడు. ఇలా ప్రస్తుతం జోస్ బట్లర్ ఫుల్ ఫామ్ లో కొనసాగుతూ అదరగొడుతున్న నేపథ్యంలో ఇక ప్రత్యర్థి బౌలర్లకు కనీసం మీద కునుకు లేకుండా చేస్తున్నాడు అనే చెప్పాలి. ఇక ఈ స్టార్ ప్లేయర్ ని అవుట్ చేసేందుకు ప్రతీ మ్యాచ్లో సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతున్నారు ప్రత్యర్థి బౌలర్లు.
ఇలా బౌలర్లు ఎన్ని వ్యూహాలతో వచ్చినా అద్భుతమైన బ్యాటింగ్తో ప్రతి బంతిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు జోస్ బట్లర్ ఇక వరుసగా మూడు సెంచరీలు చేసి అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే. ఇంకా రాజస్థాన్ ఆడాల్సిన మ్యాచులు చాలానే ఉండటంతో ఇక ఈసారి జోస్ బట్లర్ సెంచరీలతో రికార్డు సృష్టించడం ఖాయం అని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు మూడు సెంచరీలు 2 హాఫ్ సెంచరీలతో 491 పరుగులు సాధించి అత్యధిక పరుగులు సాధించిన వీరుడిగా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు జోస్ బట్లర్. ఇకపోతే తాను అద్భుతమైన ఫామ్లో ఉండడం వెనుక ఒక పాకిస్థాన్ క్రికెటర్ ఉన్నాడు అంటూ జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.
ఇక ఆ ప్లేయర్ ఎవరో కాదు పాకిస్తాన్ మాజీ ఆటగాడు ముస్తాక్ అహ్మద్. స్పిన్ బౌలింగ్ లో తన బలహీనతలను తన బలాలుగా మార్చుకోవడంలో ముస్తాక్ అహ్మద్ ఎంతో తోడ్పడ్డాడు అంటూ జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు. ముస్తాక్ అహ్మద్ ఎప్పుడూ నన్ను మొదట ఆఫ్ సైడ్ లో ఆడమనేవాడు. ఆ తర్వాత లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించమనేవాడు. ఇక ఆ తర్వాతే నా బ్యాటింగ్ స్టైల్ లో మార్పులు చేసుకున్నాను. ఇటీవలే ఒక స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు. కాగా 2008 నుంచి 2014 వరకు ఇంగ్లాండ్ స్పిన్ బౌలింగ్ కోచ్గా ముస్తాక్ అహ్మద్ పని చేశాడు అనే విషయం తెలిసిందే. ఆ సమయంలోనే తనకు మెరుగైన సలహాలు ఇచ్చి తాను ఉత్తమంగా రాణించడానికి తోడ్పాటు అందించాడు అంటూ జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు..