మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని యాదమరి మండలం ఎస్సై ప్రతాప రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశానుసారం మండల కేంద్రంలో మద్యం తాగి వాహనాలు నడిపితే అరెస్టు చేసి , కోర్టుకు హాజరు పరుస్తామని జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో కొంతమంది మద్యం సేవిస్తున్నారని అలా చేయడం చట్టరీత్యా నేరమని వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు. ప్రతిరోజు వాహన తనిఖీలు జరుగుతుందని, మద్యం తాగి ఎవరైనా వాహనం అడిగితే కేసు నమోదు చేస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని, రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు.