బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ ఖాన్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన 'డర్' సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని నటి రవీనా టాండన్ బయటపెట్టారు. ఆ చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం మొదట తనకే వచ్చిందని, అయితే స్విమ్‌సూట్ ధరించడానికి ఇష్టపడక ఆ ప్రాజెక్ట్‌ను తిరస్కరించానని ఆమె తెలిపారు. సినిమా విడుదలై 32 ఏళ్లు గడిచిన తర్వాత ఈ విషయాన్ని ఆమె వెల్లడించడం గమనార్హం.దిగ్గజ దర్శకుడు యశ్ చోప్రా దర్శకత్వంలో 1993లో వచ్చిన 'డర్' చిత్రంలో కథానాయిక పాత్ర కోసం చిత్రబృందం ముందుగా తననే సంప్రదించిందని రవీనా గుర్తుచేసుకున్నారు. "ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలు నాకు అసౌకర్యంగా అనిపించాయి. ముఖ్యంగా ఓ సన్నివేశంలో స్విమ్‌సూట్ వేసుకోవాలని చెప్పారు. నాకంటూ కొన్ని నియమాలు ఉండటంతో కాస్ట్యూమ్స్ విషయంలో నేను రాజీపడలేకపోయాను. అందుకే ఆ సినిమా ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాను" అని రవీనా వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa