ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రజినీకాంత్ హీరోగా కమల్ హస్సన్ నిర్మాణంలో నూతన సినిమా

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 06, 2025, 05:29 PM

తమిళ చిత్ర పరిశ్రమలో ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. దశాబ్దాలుగా వెండితెరపై తమ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఇద్దరు దిగ్గజాలు కమల్ హాసన్, రజినీకాంత్ ఇప్పుడు కొత్త పాత్రల్లో చేతులు కలపనున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా, లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాతగా ఓ భారీ చిత్రం రాబోతోంది. ఈ చారిత్రక ప్రాజెక్ట్‌ను కమల్ హాసన్ నిర్మాణ సంస్థ 'రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్' నిర్మించనుంది.బుధవారం ఈ సంచలన ప్రకటన వెలువడింది. రజినీకాంత్ 173వ చిత్రంగా రానున్న ఈ సినిమాకు (#Thalaivar173) సుందర్ సి దర్శకత్వం వహించనున్నారు. ఇది ఒక మాగ్నమ్ ఓపస్ చిత్రమని కమల్ హాసన్ తెలిపారు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించిన ఆయన, తన స్నేహితుడు రజినీకాంత్‌తో దిగిన ఫొటోను పంచుకున్నారు. తమ స్నేహాన్ని వర్ణిస్తూ ఓ తమిళ కవితను కూడా పోస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa