బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్‌కు కశ్మీర్ పర్యటనలో ఒక మధురమైన అనుభవం ఎదురైంది. తన కెమెరాతో కశ్మీర్ అందాలను బంధిస్తున్న ఆయనకు లోయలో అరు అనే ఓ చిన్నారి తారసపడింది. ఆ పాప భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు పెద్ద అభిమాని అని, స్మృతి తన ఫేవరెట్ ప్లేయర్ అని ఆమెకు చెప్పమని కబీర్ ఖాన్‌ను కోరింది. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు."కశ్మీర్‌లో కెమెరాతో తిరుగుతున్నప్పుడు నాకు ఇలాంటి మ్యాజికల్ మూమెంట్స్ దొరుకుతాయి. అరు అనే ఈ చిన్నారి తన ఫేవరెట్ ప్లేయర్ స్మృతి మంధాన అని చెప్పమంది. ఈ పోస్ట్ స్మృతి చూస్తుందని ఆశిస్తున్నాను" అని కబీర్ ఖాన్ రాశారు. అక్కడే కొందరు పిల్లలు పర్వతాల మధ్య ఉన్న వాగును బౌండరీగా చేసుకొని క్రికెట్ ఆడుతున్న ఫోటోలను కూడా ఆయన షేర్ చేశారు. కబీర్ ఖాన్ ఆశించినట్లే ఈ పోస్ట్ స్మృతి మంధాన దృష్టికి వెళ్లింది. ఆమె వెంటనే స్పందిస్తూ "దయచేసి అరులోని ఆ చిన్నారి ఛాంప్‌కు నా తరఫున ఒక పెద్ద హగ్ ఇవ్వండి. నేను కూడా తనకోసం ఎదురుచూస్తానని చెప్పండి" అని కామెంట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa