తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ‘బాహుబలి’ సినిమా, రెండు భాగాలను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో ఒకే సినిమాగా రీ రిలీజ్ అయింది. ఈ ఏడాది అక్టోబర్ 31న థియేటర్లలో రీ రిలీజైన ఈ మూవీ దేశవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో గురువారం (డిసెంబర్ 25) నుంచి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్ వెర్షన్ లో తొలగించిన సుమారు 90 నిమిషాల సన్నివేశాలను ఓటీటీ వెర్షన్ లో యాడ్ చేస్తారని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa