నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్, నటుడు శివాజీ ఇటీవల హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మహిళల హక్కులు, బాధ్యతలు తమకు తెలుసని, డ్రెస్సింగ్ గురించి ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. కొందరు పురుషులు, మహిళలు తన వయసును అడ్డం పెట్టుకుని తనను తక్కువగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇది మహిళలపై నియంత్రణ కోల్పోతామన్న భయం, బలహీనమైన పితృస్వామ్య అహంకారం వల్ల జరుగుతుందని అనసూయ పేర్కొన్నారు.