ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాలీవుడ్‌ డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు పూనమ్ కౌర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 07, 2026, 01:08 PM

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూనమ్ మాట్లాడుతూ, టాలీవుడ్‌లోని ఓ ప్రముఖ డైరెక్టర్ ఓ హీరోయిన్ కోసం తన భార్యను తీవ్రంగా చిత్రహింసలకు గురి చేశాడని ఆరోపించింది. అతడు తన భార్యను దారుణంగా కొట్టడంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయిందని, ఆసుపత్రిలో వారం రోజుల పాటు చికిత్స పొందాల్సి వచ్చిందని చెప్పింది. ఇలాంటి దారుణం జరిగినా ఆ భార్య ఎవరికీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయిందని, అన్యాయం జరిగినా బయటకు రాలేదని పూనమ్ విచారం వ్యక్తం చేసింది. అంతేకాకుండా, ఆ హీరోయిన్ సినిమా ఈవెంట్లకు కూడా హాజరవుతూ ఉండేదని, ఈ విషయం తెలిసినప్పుడు తాను చాలా షాక్ అయ్యానని, మనుషులు ఇలా కూడా ఉంటారా? అనిపించిందని చెప్పింది.అయితే, పూనమ్ ఆ డైరెక్టర్ పేరును మాత్రం బహిరంగంగా చెప్పలేదు. హీరోయిన్ ఎవరన్నది కూడా రివీల్ చేయలేదు. దీంతో సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆ డైరెక్టర్ ఎవరు? ఆ హీరోయిన్ ఎవరు? అని పలు ఊహాగానాలు చేస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa