పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్ మూవీ చేస్తున్నాడు . ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. 15 రోజుల నుంచి నాన్ స్టాప్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ఈ చిత్రం కోసం కేవలం 25 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చాడు పవన్. ఈ టైమ్‌లోనే పవన్ పాత్రను పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ఇక పవన్ కూడా చాలా వేగంగా సినిమాను పూర్తి చేస్తే కానీ తన రాజకీయాలకు టైమ్ దొరకదని భావిస్తున్నాడు. అందుకే మరో పని పెట్టుకోకుండా ముందు పింక్ రీమేక్ పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఈ చిత్రం కోసం దాదాపు 50 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాడని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి చేసి విడుదల చేయాలని చూస్తున్నారు . దర్శక నిర్మాతలు అనుకున్నట్లుగానే మే 15న పింక్ రీమేక్ విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేసాడు నిర్మాత దిల్ రాజు. జాను ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న దిల్ రాజు.. పింక్ సినిమా రిలీజ్ డేట్ గురించి చెప్పాడు. గబ్బర్ సింగ్ మే నెలలోనే పింక్ రీమేక్ రాబోతుంది. 2012 మే 11న గబ్బర్ సింగ్ విడుదలైంది.. అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది ఈ సినిమా. అందుకే అదే నెలలో ఇప్పుడు రీ ఎంట్రీ సినిమాను కూడా విడుదల చేస్తున్నారు. సినిమా మొత్తాన్ని 50 రోజుల్లోనే పూర్తి చేయబోతున్నాడు దర్శకుడు వేణు. ముందే రిలీజ్ డేట్ లాక్ చేసుకుని షూట్ మొదలుపెట్టారు. ఎంసిఏ సినిమా తర్వాత ఈయన చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకు వకీల్ సాబ్ కానీ లాయర్ సాబ్ కానీ టైటిల్ అనుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa