రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ తెలుగు మూడవ సీజన్‌లో విన్నర్‌గా నిలిచి తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి దగ్గరైయాడు. అది అలా ఉంటే ఓ వైపు సూపర్ స్టార్స్‌కు పాటలు పాడుతూనే రాహుల్ సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకున్నాడు. రాహుల్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తోన్న రంగమార్తండలో నటించే అవకాశం పొందిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని రాహుల్ ఆ మధ్య తన సోషల్ మీడియాలో ప్రకటిస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. డైరెక్టర్ కృష్ణవంశీ 'రంగమార్తాండ' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మరాఠి సినిమా నటసామ్రాట్‌కు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాలో జాతీయ ఉత్తమ నటుడు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ , కమెడియన్ బ్రహ్మనందంలు నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక, రాహుల్‌కు జోడిగా నటిస్తోంది. శివాత్మిక 'దొరసాని' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తరువాత మంచి కథల కోసం వెయిట్ చేస్తున్న ఆమె, కృష్ణవంశీ సినిమాలో ఛాన్స్ కొట్టేయడం విశేషం. అంతేకాదు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చే కొన్ని సన్నివేశాలను ఇటీవలే దర్శకుడు వంశీ చిత్రీకరించినట్టు చెబుతున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కాగా దీనికి సంబందించి రాహుల్ తన సోషల్ మీడియాలో ఓ పిక్ పోస్ట్ చేశాడు. ఆ పిక్‌లో రాహుల్, శివాత్మిక కలిసి బాక్ విత్ శివాత్మిక అని త్వరలో పెద్ద గుడ్ న్యూస్ రాబోతోందని తెలిపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa