రాజ్ తరుణ్, చిత్రా శుక్లా జంటగా నటించిన చిత్రం 'రంగుల రాట్నం'. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకి శ్రీ రంజని దర్శకత్వం వహించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా తెరపైకి రానుంది. ఇదిలా ఉంటే.. ఈ రోజు (శనివారం) ఈ సినిమాలోని 'ఏమైంది' అనే లిరికల్ వీడియో సాంగ్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. యువతని ఆకట్టుకునేలా ఈ పాట ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa