గురువారం నెట్‌ఫ్లిక్స్‌లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'కృష్ణ అండ్ హిజ్ లీల' చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వాడ్నికట్టి హీరోయిన్లుగా నటించారు. రానా దగ్గుబాటి చిత్రాన్ని సమర్పించారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. తాజాగా ఈ సినిమాపై సైబర్ కేసు నమోదైంది. ఈ చిత్రంలో హీరో సిద్ధు ముగ్గురు హీరోయిన్‌లతో ప్రేమాయణం సాగిస్తాడు. పాత్రలందరికి దేవుళ్లపేర్లు పెట్టి రొమాన్స్ నడిపించినందుకు రాకేష్ ఫిర్యాదు చేశాడు. సినిమాలో ప్రధాన నటులకి హిందూ దేవతల పేర్లను ఉపయోగించినందుకు రాకేశ్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు దాఖలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa