ప్రతిరోజు పండగే' సినిమా సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్నాడు సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్. అయితే త్వరలో ఐఏఎస్ ఆఫీస్ గా ప్రేక్షకుల ముందుకు రాటానికి సిద్ధం అవుతున్నాడు ఈ యంగ్ హీరో. దేవకట్ట దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో తేజ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట. ఇప్పటికే ఐఏఎస్ ఆఫీసర్ల విధివిధానాలు, వారి బాడీ లాంగ్వేజ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. ఫిట్‌గా కనిపించేందుకు బరువు కూడా తగ్గుతున్నాడట. మరోవైపు ఈ సినిమాలో రమ్య కృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తుందట. కరోనా పరిస్థితుల సర్దుమణిగాక ఈ చిత్రం పట్టాలు ఎక్కనుంది. ఇక తేజ్ ప్రస్తుతం నటిస్తున్న 'సోలో బ్రతుకే సో బెటర్' రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa