కార్తికేయ హీరోగా నూతన దర్శకుడు శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. తాన్య రవిచంద్రన్ కథానాయిక. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై 88 రామారెడ్డి నిర్మిస్తున్నారు. సోమవారం కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. ‘‘కొత్త కథాంశంతో తెరకెక్కనున్న చిత్రమిది. ఇందులో కార్తికేయ ఎన్‌ఐఏ అధికారిగా కనిపిస్తారు’’ అని నిర్మాత చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa