కరోనా వైరస్ విజృంభణ వల్ల విధించిన లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓ యాడ్ షూటింగ్ కోసం మళ్లీ కెమెరా ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహేశ్ బాబు కొత్త లుక్‌లో ఉన్న ఫొటోలు ఇటీవల విపరీతంగా వైరల్ అయ్యాయి. తాజాగా, ఆ యాడ్ విడుదలైంది.
ఈ ప్రకటనలో మహేశ్ బాబు లుక్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. ఇందులో మహేశ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఓ లుక్‌లో చాలా యంగ్ గా కనపడుతుండగా, మరో లుక్‌లో మెలితిరిగిన మీసంతో ఉన్నాడు. మహేశ్ బాబును ఎన్నడూ లేని విధంగా ఇలాంటి మీసంతో కనపడుతుండడం ఆయన అభిమానులను అలరిస్తోంది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ కోసం మహేశ్ ఈ యాడ్‌లో నటించాడు. డబుల్ ధమాకా ఆఫర్ నేపథ్యంలో ఇలా మహేశ్ డబుల్ యాక్షన్‌లో కనపడి ప్రేక్షకులకు డబుల్ ధమాకా మజా అందించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa