ధీరేంద్ర సంతోష్ దర్శకత్వంలో యంగ్ హీరో నాగ శౌర్య, కేతిక శర్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం ‘లక్ష్య’. ఈ చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది.ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా, ఈ నెల 4వ తేదీన ఈ సినిమా నుంచి ‘సాయ సాయ’ అనే పూర్తి లిరికల్ వీడియోను విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించారు. జగపతి బాబు, సచిన్ ఖేదేకర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa