ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2021 తెలుగు సినిమా చరిత్రలో బాలయ్యదే హవా గా తేల్చేసిన సినీ వర్గం

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 29, 2021, 03:49 PM

 నట సింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన యాక్షన్ సినిమా ''అఖండ''. భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. కష్టకాలంలో  పెద్ద సినిమాలకు ధైర్యాన్నిచ్చిన చిత్రంగా నిలిచింది. ‘సింహా’ ‘లెజెండ్’ వంటి రెండు సూపర్ హిట్స్ తర్వాత హ్యాట్రిక్ హిట్ కొట్టడమే లక్ష్యంగా బరిలో దిగిన బాలయ్య, బోయపాటి  'అఖండ'మైన విజయాన్ని అందుకున్నారు.  ఈ క్రమంలో టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు సృష్టించారు.
విడుదల ఐన రోజు నుండి  విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ''అఖండ'' చిత్రం ఇప్పటి వరకు 125 కోట్లకు పైగా రాబట్టినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 2021 తెలుగులో అతి పెద్ద లాభదాయకమైన చిత్రంగా 'అఖండ' రికార్డ్ క్రియేట్ చేసిందని తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోని కాకుండా ఓవర్ సీస్ లోనూ 'అఖండ' మానియా  కొనసాగింది. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన పది రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. అలానే అమెరికాలో  మిలియన్ డాలర్లకిపైగా కలెక్ట్ చేసి ఖండ ఖండాల వసూళ్ల ప్రభంజనం సృష్టించింది.
కరోనా  ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల్లోనూ 'అఖండ' ఈ స్థాయి కలెక్షన్స్ రాబట్టడం గొప్ప విషయమెనే చెప్పాలి. ఇది బాలకృష్ణ సినీ జీవితంలో మైలురాయిగా.. అత్యధిక ఓవర్ సీస్ వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. అలానే దర్శకుడు బోయపాటి శ్రీను కెరీర్ లో అమెరికా మార్కెట్ లో మిలియన్ మార్క్ అందుకున్నట్లు చిత్రంగా నిలిచినట్లు తెలుస్తోంది. కాగా 'అఖండ' చిత్రంలో అఘోరాగా మురళీకృష్ణగా రెండు పాత్రల్లో బాలకృష్ణ నట విశ్వరూపం చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ అందించిన  బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఈ సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించిందని చెప్పవచ్చు. పాటల కంటే కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ తో థమన్ ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు.
 ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్, జగపతి బాబు, పూర్ణ , కాలకేయ ప్రభాకర్ తథితరులు  కీలక పాత్రలు పోషించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa