యువ కథానాయకుడు శ్రీ విష్ణు నుంచి వచ్చిన కొత్త చిత్రం ‘అర్జున ఫల్గుణ’. అలానే ‘జోహార్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన తేజ మార్ని, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ చిత్రాన్ని రూపొందించాడు. ‘‘నాది కాని కురుక్షేత్రంలో, నాకు తెలియని పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాను. అయినా బలైపోవడానికి నేను అభిమణ్యుణ్ని కాదు. అర్జునుణ్ని’’ అంటూ ట్రైలర్ లో చెప్పిన డైలాగ్ అభిమానులను ఉత్కంఠకు గురి చేసింది. కానీ మరి అనుకున్న స్థాయిలో సినిమా లేకపోవడం , కధలో క్లారిటీ మిస్ అవ్వడం వలన సినిమాకు అంత రెస్పాన్స్ రాలేదు అంటున్నారు చుసిన ప్రేక్షకులు.
సినిమాలో కొత్తదనం లేకపోవడం ,మామూలు కథగా ఉండి, గోదావరి పల్లెటూరి వాతావరణం కలిగి ఉండటం లాంటివి ఈ సినిమాలో చూడొచ్చు. ఈ తరహాలో ఏది వరకు చాల సినిమాలే వచ్చాయి కాబట్టి ఈ సినిమా ఎప్పుడు నార్మల్ సినిమాగా ఐపోయింది. అలానే ఎలాంటి సినిమాలు కాలక్షేపానికి చూడటానికి తప్ప ఎప్పుడు ఉన్న పండగ వాతావరణానికి సరిపోదు అంటున్నారు ప్రేక్షకులు . ఏది ఏమైనా , ఈ సరైన శ్రీ విష్ణు మంచి కధ ని ఎంచుకుంటే బాగుంటది అని ఆశిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa