ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ వార్తలను ప్రోత్సహించవద్దు: హీరో అజిత్

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 03, 2022, 05:25 PM

తమిళనాడులో సినీతారలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తమిళనాడును ఎక్కువ కాలం పాలించిన సీఎంలు కరుణానిధి, ఎంజీఆర్, జయలలితలు సినీ పరిశ్రమకు చెందిన వారే. మరోవైపు హీరో అజిత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు కూడా ఎన్నోసార్లు వచ్చాయి. ప్రతిసారి ఆ వార్తలను ఆయన ఖండించారు. తాజాగా మరోసారి ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తనకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తెలిపారు. ఇదే విషయంపై ఆయన పర్సనల్ మేనేజర్ సురేశ్ చంద్ర మాట్లాడుతూ, అజిత్ కు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని చెప్పారు. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలను ప్రోత్సహించవద్దని మీడియాను కోరుతున్నామని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa