ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విరాటపర్వం రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన రానా

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 03, 2022, 06:42 PM

తెలంగాణ ప్రాంతంలో నక్సల్స్ నేపథ్యంతో తెరకెక్కిన సినిమా విరాటపర్వం. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో దగ్గుబాటి రానా, సాయిపల్లవి, ప్రియమణి నటించారు. అయితే, ఈ సినిమా విడుదలపై తాజాగా రానా క్లారిటీ ఇచ్చాడు. ‘ఒకటి, రెండ్రోజుల్లో సినిమా ప్రివ్యూ చూడబోతున్నాను. ఓ మంచి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి, అతి త్వరలో సినిమా విడుదల చేస్తాం’ అని రానా చెప్పుకొచ్చాడు. యదార్థ సంఘటనల ఆధారంగా 1990’s నాటి విప్లవ కథగా విరాటపర్వం తెరకెక్కుతోంది. రానా, ప్రియమణి నక్సలైట్లుగా కనిపించనున్నారు. అభ్యుదయ భావాలు కలిగిన యువకుడిగా రానా, అతడి కవితలు చదివి అతడి ప్రేమకోసం వెతుకుతూ వెళ్లి చిక్కుల్లో పడ్డ యువతిగా సాయిపల్లవి కనిపిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa