ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీలోకి రవితేజ “ఖిలాడీ”

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 05, 2022, 10:44 AM

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, డింపుల్ హయాతీ, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా, రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఖిలాడీ”. పెన్ స్టూడియోస్ మరియు ఏ స్టూడియోస్ పతాకాలపై సత్యనారాయణ కోనేరు మరియు రమేష్ వర్మలు సంయుక్తంగా నిర్మించారు. ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కి సిద్దమయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో మార్చి 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, యాంకర్ అనసూయ కీలక పాత్రలు పోశించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. మరీ ఓటీటీలోనైనా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa