ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాధేశ్యామ్ సంబరాలలో అపశృతి ....

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 11, 2022, 12:56 PM

రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే నటించిన చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుండటంతో ధియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. సాహూ అనంతరం  దాదాపు మూడేళ్ళ తర్వాత రానున్న ప్రభాస్ సినిమా కావటంతో అది కూడా ఈ సినిమాలో ప్రభాస్ చాలా కాలం తర్వాత లవర్ బాయ్ లా నటిస్తుండటంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా రాధేశ్యామ్ భారీ కటౌట్లు, బ్యానర్లు కడుతున్నారు. ఈ నేపథ్యంలో కారంపూడి లోని ఒక ధియేటర్ వద్ద అపశృతి జరిగింది. చల్లా కోటేశ్వర రావు అనే ప్రభాస్ అభిమాని ఫ్లెక్సీ కడుతుండగా కాలు జారీ పక్కనే ఉన్న కరెంటు తీగలపై పడటంతో కరెంటు షాక్కు గురైయ్యాడు. ఈ సంఘటనలో మరో ఇద్దరికీ కూడా గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వీరిని హాస్పిటల్ కి తరలించి చికిత్స చేయిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa