యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కిన చిత్రం ‘‘రాధేశ్యామ్’’. ఈ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రం నుండి విడుదలైన మ్యూజికల్ ఆఫ్ ది ఏజెస్ యూట్యూబ్‌లో ఇప్పటివరకు అన్ని భాషలలో 20 మిలియన్లకు పైగా వీక్షణలను అందుకుంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సంగీత సంచలనం తమన్ నేపథ్య సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa