పెద్ద పాప చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప.. అంటూ బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియా అభిమానులు పాటేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రెండు సినిమాల్లో నటిస్తోంది. హీరోపంతి 2, ఏక్ విలన్ రిటర్న్ సినిమాలు చేస్తుంది. ఇందులో హీరోపంతి 2 షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్ 29 హీరోపంతి 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం ఈ సినిమా టైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. మరోవైపు ఏక్ విలన్ రిటర్న్స్ షూటింగ్ గురువారం పూర్తయింది. ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఒకే రోజు హైలైట్ అయ్యాయి. ఇక చిన్న గౌను వేసుకున్న తారా సుతారియా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa