టాలీవుడ్ హీరో ఆదిసాయికుమార్ నటించిన సినిమాలు ఈ మధ్యకాలంలో బాక్స్ఆఫీస్ వద్ద పెద్దగా ప్రాభవం ఏమి చూపలేదు.తాజాగా ,ఫణికృష్ణ దర్శకత్వంలో ఆదిసాయికుమార్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ప్రకటించాడు.ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.కేకే రాధామోహన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,కోలీవుడ్ నటి మర్నా మీనన్ ఈ సినిమాలో ఆదికి జోడిగా కనిపించనుంది.ఇదే విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ధృవన్ సంగీత దర్శకుడు.ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa