రిలీజ్ కు ముందే RRR సినిమా సంచలనం సృష్టిస్తుంది. సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. హైదరాబాద్ లో బ్లాక్ లో రూ.3500కి టికెట్లు అమ్ముతున్నారు. డిస్టిబ్యూటర్లు కావాలని టికెట్లు లేవని చెప్పి బ్లాక్ లో అమ్ముతున్నారన్న ఆరోపణలున్నాయి. మరో వైపు దేశ వ్యాప్తంగా కూడా RRR సినిమా టికెట్ల రేట్లు విపరీతంగా ఉన్నాయి. ఢిల్లీ 2100, ముంబై 1790, పూణే 1250, కోల్ కత్తాలో 1090, మొహలీ 975, బెంగళూరు 700 గా సినిమా టికెట్ల రేట్లున్నాయి.