ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సలార్' రిలీజ్ అయ్యేది అప్పుడేనా ?

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 26, 2022, 05:01 PM

ప్రభాస్ హీరోగా 'సలార్' రూపొందుతోంది. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ మాస్ యాక్షన్ హీరోగా చూపించనున్నాడు. ప్రభాస్ 'రాధేశ్యామ్'పై పూర్తి దృష్టి పెట్టడం .. 'ఆది పురుష్'ను ముందుగా పూర్తిచేయాలనుకోవడం వలన, 'సలార్' షూటింగు ఆలస్యంగా జరుగుతూ వచ్చింది. అసలు ఈ సినిమా ఏ స్టేజ్ లో ఉందనేది ఎవరికీ తెలియడం లేదు. అందుకు సంబంధించిన అప్ డేట్స్ రావడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాత మాట్లాడుతూ, "ఇంతవరకూ ఈ సినిమా 30 శాతం చిత్రీకరణను జరుపుకుంది. మే నుంచి తదుపరి షెడ్యూల్ షూటింగు మొదలవుతుంది. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నాము" అని చెప్పుకొచ్చారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, జగపతిబాబు ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa