ఉప్పెన సినిమాతో తెలుగువారికి పరిచయమైన కన్నడ బ్యూటీ 'కృతిశెట్టి' వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఉప్పెన తర్వాత, శ్యామ్ సింగరాయ్ బంగార్రాజుతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని హ్యాట్రిక్ హీరోయిన్ గా మారింది. ఇప్పటికే తెలుగులో సుధీర్ బాబు సరసన “ఆ అమ్మాయి గురుంచి మీకు చెప్పాలి”, నితిన్ జంటగా “మాచర్ల నియోజకవర్గం”, రామ్ పోతినేని జంటగా “ది వారియర్” చిత్రాల్లో నటించింది. బాలా, స్టార్ డైరెక్టర్ సూర్య కాంబినేషన్ లో వస్తున్న సినిమాతో కోలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా కృతి శెట్టికి హీరో ధనుష్ సరసన నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ ని అనుకున్నారు. అయితే ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ మిస్సయిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ్‌లో భారీ సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో కోలీవుడ్ స్టార్ హీరో సరసన ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తుంది.