రామ్ చరణ్ ఇండియా మరో టాప్ డైరెక్టర్ శంకర్ తో భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. దర్శకుడు శంకర్‌తో రామ్ చరణ్ కెరీర్‌లో ఇది 15వ సినిమాగా ఇది ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతుంది. అయితే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు కాస్త గ్యాప్‌లో ఉంది.
తదుపరి షెడ్యూల్ షూటింగ్‌లో ఉన్నప్పటికీ లేటెస్ట్ అప్‌డేట్ మాత్రం వెల్లడి కాలేదు. అయితే తాజాగా జూన్ 20 నుంచి మేకర్స్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది.అయితే గత కొద్దిరోజుల కితం వైజాగ్ షెడ్యూల్ ని హోల్డ్ చేసి షూటింగ్ స్టార్ట్ చేస్తారా లేక వేరే చోట ప్లాన్ చేస్తారా అనేది చూడాలి.