లై సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తో జతకట్టిన మేఘా ఆకాష్ ఆపై తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటించినప్పటికీ చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. అందం, అభినయం ఉండి కూడా కాలం కలిసిరాక చిన్నాచితకా సినిమాల్లో నటిస్తూ బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. తాజాగా మేఘా ఆకాష్ యువనటుడు, సూర్యకాంతం ఫేమ్ రాహుల్ విజయ్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకు కథను సుశాంత్ రెడ్డి అందించగా, అభిమన్యు బద్ది దర్శకత్వం వహిస్తున్నారు. కోట ఫిలిం ఫ్యాక్టరీ, ట్రిప్పి ప్లిక్స్ స్టూడియోస్ బ్యానర్లపై సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మేఘా ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
నిన్న హీరో రాహుల్ విజయ్ బర్త్ డేను పురస్కరించుకుని మూవీ టైటిల్ ఎనౌన్స్మెంట్ జరిగింది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా "మాటేమంత్రము" అనే యూనిక్ అండ్ బ్రీజి టైటిల్ ను ప్రకటించడం జరిగింది. సినిమాకు మాటే మంత్రము అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని మేకర్స్ తెలిపారు. ఇప్పటికి తొంభై శాతం షూటింగు పూర్తైందని, మిగిలిన షూటింగును కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని పేర్కొన్నారు.