ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆయనపై ఉన్న గుడ్డి నమ్మకంతో, కథ వినకుండానే ప్రాజెక్ట్ ఓకే చేసిన డస్కీ బ్యూటీ

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 08, 2022, 01:43 PM

డస్కీ బ్యూటీ పూజాహెగ్డే కు, డైరెక్టర్ త్రివిక్రమ్ కు మధ్య ఉన్న రిలేషన్ పై సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్, ట్రోల్స్ ఒక రేంజులో వైరల్ అవుతున్నాయి. త్రివిక్రమ్ ఆస్థాన హీరోయిన్ అని పూజాకు నెటిజన్లు ముద్రవేశారు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో చిత్రాలలో పూజా హీరోయిన్ గా నటించింది. పూజా కెరీర్ ఎలా ఉందంటే, త్రివిక్రమ్ తో చేసిన సినిమాలకు ముందు, తర్వాత అన్నట్టు ఉంది. త్రివిక్రమ్ తో చేసిన రెండు సినిమాల తర్వాత పూజా కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. దీంతో త్రివిక్రమ్ ను పూజా గుడ్డిగా నమ్మడం మొదలెట్టింది. త్రివిక్రమ్ మహేష్ బాబుతో చేస్తున్న SSMB 28 కథను కూడా వినకుండా, గురూజీ అడగడమే తరువాయి వెంటనే ప్రాజెక్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి ఈ వార్త నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే, మహేష్ తో చెయ్యబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను త్రివిక్రమ్ ఇంకా పూర్తి చెయ్యలేదు. ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాకముందే హీరోయిన్ పేరును త్రివిక్రమ్ ఎనౌన్స్ చెయ్యటం, పూర్తి కథ వినకుండా పూజా ఓకే చెప్పటం వారిద్దరి మధ్య ఉన్న స్ట్రాంగ్ బాండ్ ను తెలియచేస్తుంది. పూజా తనపై పెట్టుకున్న నమ్మకాన్ని త్రివిక్రమ్ ఎంతవరకు కాపాడుకుంటాడో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa