గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ 'NBK107' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మాస్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి 'జై బాలయ్య' అనే టైటిల్‌ని లాక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా టైటిల్ గురించి ఇంకా మూవీ మేకర్స్ ఇంకా అధికారకంగా ప్రకటించలేదు. 'NBK107' టైటిల్ ప్రకటన కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa