ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సైనా పాత్రలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను కన్ఫర్మ్ చేశారు. దీనికి సంబంధించి సైనా దగ్గర శ్రద్ధా కపూర్ బ్యాడ్మింటన్ మెలుకువలు కూడా నేర్చుకుంది. అయితే కారణాలు తెలీదు కానీ ఈ మూవీ ఆగిపోయినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. వీటన్నింటికి తెరదించుతూ తాజాగా ఈ చిత్ర విశేషాలను చెప్పుకొచ్చింది శ్రద్ధా కపూర్. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, వచ్చే నెలలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని శ్రద్ధా తెలిపింది. ఇక ఈ చిత్రం కోసం తాను కష్టపడుతున్నట్లు కూడా శ్రద్ధా పేర్కొంది. ఇదిలా ఉంటే తెలుగులో ప్రభాస్ సరసన సాహోలో శ్రద్ధా కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa