ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విరాట పర్వం' OTT విడుదలపై లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 18, 2022, 06:42 PM

వేణు ఊడుగుల దర్శకత్వంలో టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి, సాయి పల్లవి నటించిన 'విరాట పర్వం' సినిమా జూన్ 17, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ ని అందుకుంటుంది. ఈ పీరియాడికల్ డ్రామా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై చివరి వారంలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, ఈశ్వరీ రావు, రవి ఆనంద్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa