శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమా 'ప్రిన్స్'. ఈ టాలెంటెడ్ స్టార్‌కి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన తాజా చిత్రం డాన్ తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లు రాబట్టింది.'ప్రిన్స్' సినిమాకి జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయినిగా మారియా ర్యాబోషప్కా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదిని ప్రకటించారు చిత్ర బృందం. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు.అయితే ఈ సినిమా దీపావళికి విడుదల కానుంది అని చిత్ర బృందం తెలిపింది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa