ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పుష్ప 2' షూటింగ్ ఎక్కడంటే?

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 25, 2022, 12:11 PM

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన "పుష్ప: ది రైజ్" సినిమా గతేడాది డిసెంబర్ 17న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీ మ్యూజిక్ ఆల్బమ్ కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా 2021లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో సునీల్, రావు రమేష్,అనసూయ, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో కనిపించరు. ఇప్పుడు అందరూ పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని ఇండోనేషియా మరియు సింగపూర్‌లో భారీ స్థాయిలో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప సినిమాతో భారీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ తో తన అభిమానులను అండ్ ప్రేక్షకులను మరోసారి అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది అని మేకర్స్ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa