విమల్ కృష్ణ డైరెక్షన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన చిత్రం "డీజే టిల్లు". "గుంటూరు టాకీస్" ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా పాటలకు, సిద్ధూ నటనకు ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు. తక్కువ బడ్జెట్టుతో తెరకెక్కించిన ఈ సినిమా అధిక వసూళ్లను రాబట్టింది. చిత్ర సీమలో అంతగా గుర్తింపు లేని సిద్ధూ ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు.
లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ సినిమాతో టాలీవుడ్ డిబట్ చేసిన సిద్దు, డిజె టిల్లు సినిమాకి కధ, స్క్రీన్ ప్లే అందించాడు. డీజే టిల్లు సక్సెస్ అవ్వడంతో ఆ సినిమా సీక్వెల్ ను తీసుకొచ్చే ప్రయత్నంలో అప్పటి నుండి వేరే ప్రాజెక్ట్ కు కమిటవ్వకుండా కేవలం డీజే స్క్రిప్ట్ మీదనే పని చేస్తున్నాడు. తాజాగా ఈ స్క్రిప్ట్ ఫైనల్ అయ్యినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ రోజు పూజా కార్యక్రమంతో ప్రారంభమైన ఈ సినిమా ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ ద్వారా ఎనౌన్స్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa