ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హృదయాల్ని హత్తుకుంటున్న "సీతారామం" టీజర్ ...

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 25, 2022, 04:54 PM

అందాల రాక్షసి ఫేమ్ హను రాఘవపూడి డైరెక్షన్లో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న చిత్రం "సీతారామం". ఇందులో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, నేషనల్ క్రష్ రష్మిక మండన్నా కీరోల్ ప్లే చేస్తుంది.  మలయాళ, తెలుగు, తమిళ భాషలలో ఆగస్టు 5వ తేదీన విడుదలవబోతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా టీజర్ రిలీజ్ అయ్యింది.
సరిహద్దుల్లో కాపలా కాసే రామ్ కు ఎవరు లేరని తెలిసిన సీత, తన భార్యానంటూ రామ్ కు ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. ఏకాకిగా ఇన్నాళ్లు జీవితం గడిపిన రామ్ కు సీత ఉత్తరాలు ఊరటనిస్తాయి. టీజర్ ఆద్యంతం మంచి ఫీల్ నిచ్చింది. శేఖర్ చంద్ర అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను వేరే లెవెల్ కు తీసుకెళుతుంది. ఈ లవ్ ఎంటర్టైనర్ కు మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కాశ్మీరీ ముస్లిం యువతి పాత్రను పోషిస్తున్న రష్మిక సీతారాముల్ని ఎలా కలిపింది అనే కధాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్వినీదత్, ప్రియాంక దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుమంత్, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa