మోస్ట్ ట్యాలెంటెడ్ ఇండియన్ హీరోయిన్లలో రాధికా ఆప్టే ఒకరు. పదేళ్ల సుదీర్ఘ సినీ కెరీర్ లో కమర్షియల్ సినిమాలకన్నా ప్రయోగాలకే పెద్ద పీట వేసిన రాధిక కొన్ని బోల్డ్ పాత్రలలో నటించి వివాదాస్పదమైంది. తెలుగులో ఆర్జీవీ డైరెక్ట్ చేసిన రక్త చరిత్ర, బాలయ్య సరసన లెజెండ్, లయన్ సినిమాలలో నటించింది. తన అభిప్రాయాలను ముక్కుసూటిగా, నిక్కచ్చిగా బయటకు చెప్పేసే నిష్కల్మషమైన హృదయం గల రాధికా చేసిన పలు వ్యాఖ్యలు వివాదాస్పదమవ్వడం పరిపాటిగా మారింది.తన అందం, అభినయం తో లక్షల్లో అభిమానులను సంపాదించుకున్న రాధికకు సోషల్ మీడియాలో కూడా ఒక రేంజులో ఫాలోవర్లు ఉన్నారు. తనకు సంబంధించిన స్టన్నింగ్ ఫోటోలను తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో రాధికా పోస్ట్ చేసిన ఒక ఫోటో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. సముద్రతీరాన బికినిలో పడుకుని ఉన్న రాధికా ఒక పుస్తకాన్ని చదువుతూ ఉంటుంది. ఈ స్టన్నింగ్ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa