ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైజాగ్ ఎయిర్పోర్ట్ లో గోపీచంద్ కు ఘనస్వాగతం పలికిన ఫ్యాన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 25, 2022, 06:18 PM

జూలై 1వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న "పక్కా కమర్షియల్" చిత్రం ప్రస్తుతం ముమ్మర ప్రమోషన్స్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో విజయవాడ, వైజాగ్ కు వెళ్లి అక్కడి ప్రేక్షకులతో ముచ్చటించి తగిన ప్రచారం చెయ్యాలని నిర్ణయించిన టీం ఈ రోజు ఉదయం విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్లో గ్రాండ్ లైవ్ ఇంటిరాక్షన్ సెషన్ లో పాల్గొంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే ముందు ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు గోపీచంద్ మరియు మారుతి.
కొంచెంసేపటి క్రితమే విమానంలో వైజాగ్ చేరుకున్నారు గోపీచంద్, మారుతి. వైజాగ్ అభిమానులు ఎయిర్పోర్టులో వారికి ఘనస్వాగతం పలికారు. ఇంకాసేపట్లో వైజాగ్ లోని శ్రీరామా థియేటర్లో జరగనున్న లైవ్ సెషన్ లో గోపీచంద్, మారుతి అండ్ టీం పాల్గొని వైజాగ్ ప్రేక్షకులతో ముచ్చటిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa