ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాని చేతుల మీదుగా పృథ్విరాజ్ "కడువా" టీజర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 25, 2022, 06:20 PM

మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా, షాజీ కైలాష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "కడువా". ఈ చిత్రంలో సంయుక్త మీనన్, వివేక్ ఒబెరాయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పృథ్విరాజ్ ప్రొడక్షన్స్, మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్లపై సుప్రియ మీనన్, లిస్టిన్ స్టీఫెన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జెక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ టీజర్ ను తెలుగులో నాచురల్ స్టార్ నాని విడుదల చేసారు. ఈ సందర్భంగా కడువా మూవీ టీం కు నాని బెస్ట్ విషెస్ ను తెలిపారు. మలయాళ, తెలుగు భాషల్లో జూన్ 30న థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa